Featured Post

రూపాయి మహాపతనం

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...

20, నవంబర్ 2024, బుధవారం

నేల...నీళ్లు

నవంబర్‌ 21... ప్రపంచమత్స్య దినోత్సవం! మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు! చేపలనే కాదు! సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు! కొన్ని సంవత్సరాల క్రితం వరకు సముద్ర జలాల నిండా కనపడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమవుతుంటే ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలియక సతమతమౌతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులు 1997లో మొట్టమొదటిసారిగా వరల్డ్‌ ఫిషరీస్‌ కన్సార్టియమ్‌ ఫోరమ్‌ పేరిట మన దేశ రాజధాని న్యూఢల్లీిలో ఒక సమావేశం జరిగింది. దాదాపు 18 దేశాలనుండి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో వరల్డ్‌ ఫిషరీస్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, కార్పొరేట్‌ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్‌ 21ను మత్స్య దినోత్సవంగా జరపాలని ఆ సమావేశం పిలుపునిచ్చింది. తొలిసమావేశం జరిగి 27 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్యకారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు. ఇప్పుడు జలచరాలకే కాదు... మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలుష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈ దుష్పరిణామానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూములపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని అన్ని జలవనరులను విషతుల్యంగా మారుస్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తున్నారు. జలచరాల గుడ్లను కూడా మిగల్చకుండా ఊడ్చేస్తున్నారు. అందుకే. మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపునింపిన నీళ్లకోసం పోరాడాల్సివస్తోంది! ఈ పరిణామాలు మన రాష్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా తూర్పుతీరంలోని లక్షలాదిమంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి. తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్పచెబుతున్నాయి. సముద్రజలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎందరు? రాష్ట్రానికి సుదీర్ఘమైన 974 కి.మీల సముద్రతీర ప్రాతం ఉంది. సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011లెక్కల ప్రకారం) సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం 12,747 మోటారైజ్డ్‌ ,1771 మెకనైజ్డ్‌,14,677 సాంద్రాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గాయి. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వ్యాపారవేత్తల నుండి వందల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కారణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యంగా మారింది. ఎక్కడైతే స్వేఛ్చగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీడ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను, చేప పిల్లలను వదిలివేస్తూ సాగే ‘బతుకు..బతికించు’ జీవన విధానంనుండి సర్వస్వాన్ని దోచేసే కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళకింద నేలను... బోటుకింద నీళ్లను ...’ లాగేసే ప్రభుత్వ విధానాలు తీర ప్రాంతంలో తిష్టవేయడంతో మత్స్యకారుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. ఏం జరుగుతోంది...? నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగుతోంది. సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండంటో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది. నదుల్లో చేరుతున్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రంలో కలుస్తున్న విషపదార్ధాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు. రిలయన్స్‌ వంటి సంస్థలు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ నిబంధనలను కాదని బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమిగోని స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈ వాస్తవం పూర్తిగా అర్ధమైంది. ‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు. తీసుకెళ్లి చూపిచేస్తారు కూడా.. కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు. పైగా రోజురోజుకి పెరుగుతుంటుంది.’అని కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో జెట్టి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక మత్స్యకార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగుతూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్‌ బోటులో మరో ముగ్గురు, నలుగురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన ‘కొన్ని సంవత్సరాల క్రితం ఒడ్డునే చేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సివస్తుంది. రోజుల తరబడి సముద్రం మీదనే ఉండాల్సివస్తోంది. ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు. ఒక్కోసారి బోటుమీద తీసుకేళ్లే వారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు. ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో కనిపించడం లేదు. వీటిలో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్పమని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి! కలవరపెడుతున్న కోత! కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. పిల్లి పిల్లలను మార్చినట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాంతాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సివస్తోంది. అయినా, తరతరాలుగా అలవాటైన సముద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. ందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన 80 సంవత్సరాల కాలంలో ఇక్కడ 2 కిలో మీటర్ల భూమి కోతకు గురైంది. 1989 నుండి ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా! ‘ ఒకే దగ్గర నివాసం ఉండటమన్నది మరచిపోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం. మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా. ఇక్కడ ఉంటున్నాం’ అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో ఇళ్లను కోల్పోని వారు ఒక్కడ ఒక్కరంటే ఒక్కరూ లేరు. ఇలా నష్టపోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్టలతో మిగలడం వారికి మాములే! ఉప్పాడలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89 కి.మీ భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7శాతం! దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. ఏ జిల్లాలో ఎంత కోత? జిల్లా కోత(కి.మీలలో) శ్రీకాకుళం 25.12 విశాఖపట్నం 25.81 తూర్పుగోదావరి’ 89.25 కృష్ణా 57.55 నెల్లూరు 53.52 తీరం కార్పొరేట్లకి ...! కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతఈ పరిణామం మరింత వేగవంతమైంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు, మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ కాస్తా అదాని ప్రదేశ్‌గా మారుతోంది. పోర్టులను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సముద్రంలోకి నౌకలకు ఆంటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37 కి.మీ పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్‌ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16కి.మీ మేర కాంపౌండ్‌వాల్‌ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరంపోర్టు వద్ద కూడా ఇదే స్థితి. గోడ నిర్మాణంతో కి.మీ దూరం వెళ్లి వేటకు వెళ్లాల్సిన పరిస్తితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు, సెజ్‌లు, సాగరమాల ప్రాజెక్టుల పేరుతో తీర ప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, పెట్రోకెమికల్స్‌ ఫార్మా పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివిస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌, రాంకీ ఫార్మ సిటి,హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌లు వీటిలో కొన్ని! వీటి నుండి విడుదలయ్యే కాలుష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీనిని నియంత్రిస్తున్నట్లు, కాలుష్య నివారణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ చెబుతున్న విషయాలు మాటలకే పరిమితం! దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది. సముద్రమూ వారికే... మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు, వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగాపెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్‌ అక్వాకల్చర్‌ అథారిటీ`సిఎఎ (అమెండ్‌మెంట్‌) బిల్లు `2023` సాధారణ మత్స్యకారులకు ప్రాణాంతకంగా మారనుంది. ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్ధాం. 2005`06లో 24,386గా ఉన్న సాధారణ బోట్ల (నాన్‌ మోటరైజ్డ్‌) సంఖ్య 2015`16 నాటికి 17,837కు తగ్గింది. గత ఏడాదికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచనా! వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్‌ బోట్లకు లక్షల రూపాయల్లో పెట్టుబడులు అవసరమైంది. లాభాలు భారీగా వస్తుండటంతో కార్పొరేట్‌ శక్తులు ఈ రంగం పై కన్నేశాయి. వలల సైజు మార్చి సముద్రాన్ని ఊడ్చేచేయడం మొదలు పెట్టాయి. డీప్‌ సీ ఫిషింగ్‌కు కేంద్రం అనుమతిఇవ్వడంతో భారీ వెజల్స్‌ రంగ ప్రవేశం చేశాయి. వీటన్నింటి ఫలితంగా చిన్న మత్స్యకారులు మాములు బోట్లలో వేటకు వెళ్లినా చేపలు దొరకని పరిస్థితి ఏర్పడిరద. దీంతో వీరు పెద్ద బోట్లపైన కూలీలుగా మారారు. ఇది చాలదన్నుటు తాజాగా తీసుకువచ్చిన సిఎఎ బిల్లులో కోస్టల్‌ రెగ్యులేటరీ నిబంధనలను ఎత్తివేశారు. బ్లూ ఎకానమి, సముద్ర ఆధారిత టూరిజం, డీప్‌ సీ మైనింగ్‌ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్యకారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని, సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది! నేల...నీళ్లు నవంబర్‌ 21... ప్రపంచమత్స్య దినోత్సవం! మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు! చేపలనే కాదు! సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు! కొన్ని సంవత్సరాల క్రితం వరకు సముద్ర జలాల నిండా కనపడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమవుతుంటే ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలియక సతమతమౌతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులు 1997లో మొట్టమొదటిసారిగా వరల్డ్‌ ఫిషరీస్‌ కన్సార్టియమ్‌ ఫోరమ్‌ పేరిట మన దేశ రాజధాని న్యూఢల్లీిలో ఒక సమావేశం జరిగింది. దాదాపు 18 దేశాలనుండి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో వరల్డ్‌ ఫిషరీస్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, కార్పొరేట్‌ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్‌ 21ను మత్స్య దినోత్సవంగా జరపాలని ఆ సమావేశం పిలుపునిచ్చింది. తొలిసమావేశం జరిగి 27 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్యకారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు. ఇప్పుడు జలచరాలకే కాదు... మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలుష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈ దుష్పరిణామానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూములపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని అన్ని జలవనరులను విషతుల్యంగా మారుస్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తున్నారు. జలచరాల గుడ్లను కూడా మిగల్చకుండా ఊడ్చేస్తున్నారు. అందుకే. మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపునింపిన నీళ్లకోసం పోరాడాల్సివస్తోంది! ఈ పరిణామాలు మన రాష్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా తూర్పుతీరంలోని లక్షలాదిమంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి. తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్పచెబుతున్నాయి. సముద్రజలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎందరు? రాష్ట్రానికి సుదీర్ఘమైన 974 కి.మీల సముద్రతీర ప్రాతం ఉంది. సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011లెక్కల ప్రకారం) సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం 12,747 మోటారైజ్డ్‌ ,1771 మెకనైజ్డ్‌,14,677 సాంద్రాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గాయి. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వ్యాపారవేత్తల నుండి వందల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కారణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యంగా మారింది. ఎక్కడైతే స్వేఛ్చగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీడ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను, చేప పిల్లలను వదిలివేస్తూ సాగే ‘బతుకు..బతికించు’ జీవన విధానంనుండి సర్వస్వాన్ని దోచేసే కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళకింద నేలను... బోటుకింద నీళ్లను ...’ లాగేసే ప్రభుత్వ విధానాలు తీర ప్రాంతంలో తిష్టవేయడంతో మత్స్యకారుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. ఏం జరుగుతోంది...? నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగుతోంది. సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండంటో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది. నదుల్లో చేరుతున్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రంలో కలుస్తున్న విషపదార్ధాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు. రిలయన్స్‌ వంటి సంస్థలు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ నిబంధనలను కాదని బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమిగోని స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈ వాస్తవం పూర్తిగా అర్ధమైంది. ‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు. తీసుకెళ్లి చూపిచేస్తారు కూడా.. కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు. పైగా రోజురోజుకి పెరుగుతుంటుంది.’అని కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో జెట్టి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక మత్స్యకార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగుతూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్‌ బోటులో మరో ముగ్గురు, నలుగురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన ‘కొన్ని సంవత్సరాల క్రితం ఒడ్డునే చేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సివస్తుంది. రోజుల తరబడి సముద్రం మీదనే ఉండాల్సివస్తోంది. ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు. ఒక్కోసారి బోటుమీద తీసుకేళ్లే వారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు. ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో కనిపించడం లేదు. వీటిలో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్పమని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి! కలవరపెడుతున్న కోత! కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. పిల్లి పిల్లలను మార్చినట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాంతాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సివస్తోంది. అయినా, తరతరాలుగా అలవాటైన సముద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. ందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన 80 సంవత్సరాల కాలంలో ఇక్కడ 2 కిలో మీటర్ల భూమి కోతకు గురైంది. 1989 నుండి ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా! ‘ ఒకే దగ్గర నివాసం ఉండటమన్నది మరచిపోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం. మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా. ఇక్కడ ఉంటున్నాం’ అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో ఇళ్లను కోల్పోని వారు ఒక్కడ ఒక్కరంటే ఒక్కరూ లేరు. ఇలా నష్టపోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్టలతో మిగలడం వారికి మాములే! ఉప్పాడలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89 కి.మీ భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7శాతం! దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. ఏ జిల్లాలో ఎంత కోత? జిల్లా కోత(కి.మీలలో) శ్రీకాకుళం 25.12 విశాఖపట్నం 25.81 తూర్పుగోదావరి’ 89.25 కృష్ణా 57.55 నెల్లూరు 53.52 తీరం కార్పొరేట్లకి ...! కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతఈ పరిణామం మరింత వేగవంతమైంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు, మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ కాస్తా అదాని ప్రదేశ్‌గా మారుతోంది. పోర్టులను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సముద్రంలోకి నౌకలకు ఆంటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37 కి.మీ పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్‌ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16కి.మీ మేర కాంపౌండ్‌వాల్‌ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరంపోర్టు వద్ద కూడా ఇదే స్థితి. గోడ నిర్మాణంతో కి.మీ దూరం వెళ్లి వేటకు వెళ్లాల్సిన పరిస్తితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు, సెజ్‌లు, సాగరమాల ప్రాజెక్టుల పేరుతో తీర ప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, పెట్రోకెమికల్స్‌ ఫార్మా పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివిస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌, రాంకీ ఫార్మ సిటి,హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌లు వీటిలో కొన్ని! వీటి నుండి విడుదలయ్యే కాలుష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీనిని నియంత్రిస్తున్నట్లు, కాలుష్య నివారణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ చెబుతున్న విషయాలు మాటలకే పరిమితం! దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది. సముద్రమూ వారికే... మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు, వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగాపెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్‌ అక్వాకల్చర్‌ అథారిటీ`సిఎఎ (అమెండ్‌మెంట్‌) బిల్లు `2023` సాధారణ మత్స్యకారులకు ప్రాణాంతకంగా మారనుంది. ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్ధాం. 2005`06లో 24,386గా ఉన్న సాధారణ బోట్ల (నాన్‌ మోటరైజ్డ్‌) సంఖ్య 2015`16 నాటికి 17,837కు తగ్గింది. గత ఏడాదికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచనా! వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్‌ బోట్లకు లక్షల రూపాయల్లో పెట్టుబడులు అవసరమైంది. లాభాలు భారీగా వస్తుండటంతో కార్పొరేట్‌ శక్తులు ఈ రంగం పై కన్నేశాయి. వలల సైజు మార్చి సముద్రాన్ని ఊడ్చేచేయడం మొదలు పెట్టాయి. డీప్‌ సీ ఫిషింగ్‌కు కేంద్రం అనుమతిఇవ్వడంతో భారీ వెజల్స్‌ రంగ ప్రవేశం చేశాయి. వీటన్నింటి ఫలితంగా చిన్న మత్స్యకారులు మాములు బోట్లలో వేటకు వెళ్లినా చేపలు దొరకని పరిస్థితి ఏర్పడిరద. దీంతో వీరు పెద్ద బోట్లపైన కూలీలుగా మారారు. ఇది చాలదన్నుటు తాజాగా తీసుకువచ్చిన సిఎఎ బిల్లులో కోస్టల్‌ రెగ్యులేటరీ నిబంధనలను ఎత్తివేశారు. బ్లూ ఎకానమి, సముద్ర ఆధారిత టూరిజం, డీప్‌ సీ మైనింగ్‌ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్యకారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని, సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి