Featured Post

రూపాయి మహాపతనం

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...

2, డిసెంబర్ 2024, సోమవారం

‘భోపాల్‌’ దుర్ఘటనకు 40ఏళ్లు

కొన్ని కథలకు ప్రారంభమే గానీ ముగింపు ఉండదు. భారత పారిశ్రామిక చరిత్రలో మరచిపోలేని విషాద సంఘటనగా మిగిలిన భోపాల్‌ దుర్ఘటన (Bhopal Gas tragedy) బాధితుల కన్నీటి గాధలు కూడా అంతే! యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ (union Carbide Factory) కక్కిన విషంతో భోపాల్‌ మృత్యునగరంగా, శవాల దిబ్బగా మారి 40 ఏళ్లు (40 years) గడిచిపోయాయి. అయితే బాధితులకు మాత్రం నాయయం జరగలేదు. భోపాల్‌ గ్యాస్‌ పీడిత మహిళా ఉద్యోగుల సంఘటన్‌ కన్వీనర్‌ ‘ప్రధాన రాజకీయ పార్టీలు మమల్ని మోసం చేశాయి. మా సొంత పట్టణంలోనే మేం కాందీశీకులమయ్యాం. కాంగ్రెస్‌ మాకు ఏం చేసిందో, మోడీ నేతృత్వంలోని బిజెపికూడా అదే చేసింది’ అని అన్నారు. ఇప్పటికీ అదే దుస్థితి! ఎన్నికల అజెండా చేసినా... పాలకవర్గ పార్టీల నుండి ఏళ్లతరబడి నిర్లక్ష్యాన్నే చవిచూస్తున్న బాధిత ప్రజానీకం గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ కష్టాలను రాజకీయ అజెండాగా మార్చడానికి బలంగా కృషి చేసింది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఈ సంఘాలన్నీ సమావేశమైనాయి. కార్భైడ్‌ ఫ్యాక్టరీ నుండి తమకు న్యాయంగా రావాల్సిన 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించాలని, తమ పిల్లలకు భద్రమైన భవిష్యత్‌ను అందించాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు పార్టీలు, అభ్యర్థుల నుండి రాతపూర్వకంగా తీసుకోవాలని నిర్ణయించాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజానీకం కూడా వీరికి మద్దతు తెలిపారు. భోపాల్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ భోపాల్‌ అంతా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల పచారానికి వచ్చిన అభ్యర్థులను ప్రశ్నించారు. ‘మా కోసం కాదు... భావి తరాల వారికోసం ఏం చేస్తారో చెప్పండి’ అని నిలదీశారు. న్యాయం చేస్తామని మాట వరసకు చెప్పడం కాదు .. రాత పూర్వకంగా ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. ఆ ఎన్నికలప్పుడు వాగ్ధానాలు ఇచ్చిన వివిధ పార్టీలు ఆ తరువాత మళ్లీ మాములుగానే విస్మరించాయి. భోపాల్‌లో ఏం జరిగింది? 1984 డిసెంబర్‌ 2వ తేదీ రాత్రి ‘యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ’ నుండి ఒక్కసారిగా వెలువడిన విష వాయువులు భోపాల్‌ నగరాన్ని చుట్టుముట్టాయి. ఒక్కసారిగా విషవాయువులు చుట్టుముట్టడంతో ఏం జరుగుతోందో అర్ధంకాక, ఊపిరి ఆడక నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. విష వాయువుల బారి నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన వారు రోడ్లపైనే తుది శ్వాస విడిచారు. తెల్లవారే సమయానికి ఎక్కడ చూసినా శవాల కుప్పలతో భోపాల్‌ మృత్యు నగరంగా మారింది. వేలాది మంది ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనలో 10,047 మంది ప్రాణాలు కోల్పోయారని, 5,74,000 మంది విషవాయువుల ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వ అంచనా! ఈ అంకెలనే పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అయితే, మృతుల సంఖ్య 15వేలపైనే ఉంటుందని వివిధ స్వఛ్చంద సంస్థలు, సంఘాలు ప్రకటించాయి. రసాయన పారిశ్రామిక రంగంలో హీరోషిమా అణుబాంబు విస్ఫోటనంతో సమానమైనదిగా ఈ దారుణాన్ని నిపుణులు పోల్చారు. విష వాయువుల దుష్ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది. ప్రత్యక్ష బాధితులు ఈ విషాద సంఘటన జరిగిన ఇన్నేళ్ల తరువాత కూడా శిశువులు శారీరక, మానసిక వైకల్యంతో పుడుతూనే ఉన్నారు. భూగర్భ జలాలు విషతుల్యంగానే ఉన్నాయి. ఇంకా దారుణమేమిటంటే నష్టపరిహారం కోసం బాధిత కుటుంబాలు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉండటం! విస్మయాన్ని కలిగించే విషయమేమిటంటే ఇంతటి కల్లోలానికి కారణమైన విషవాయువేమిటో ఇప్పటికీ తెలియకపోవడం! ‘తయారీ రహస్యం’ పేరిట కార్బైడ్‌ సంస్థ ఆ వివరాలను వెల్లడిరచడం లేదు. మిథైల్‌ ఐసోసెనెట్‌ (ఎంఐసి) అనే రసాయనం లీక్‌ కావడమే ఈ విషాదానికి కారణమని ఇతర అధ్యయనాలు తేల్చినా అధికారిక ధృవీకరణ కోసం భారత ప్రభుత్వం ఏనాడు పట్టుబట్టలేదు. అంతేకాదు, ఈ దుర్ఘటన వెనుక ‘కార్బైడ్‌’ యాజమాన్య నిర్లక్ష్యం ఉన్నట్లు నిరూపించడంలోనూ భారత ప్రభుత్వం విజయవంతం కాలేదు. నామమాత్రంగా దక్కిన 25 వేల రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబాలు తిరస్కరించాయి. తగ్గిన రోగనిరోధక శక్తి భోపాల్‌ : విషవాయువు బారిన పడిన వారిలోనూ, వారి సంతానంలోనూ రోగ నిరోధక శక్తి గణనీయంగా తగ్గింది. కరోనా విజృంభించిన సమయంలో ఈ విషయం వెల్లడైంది. భోపాల్‌ నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా సోకి చికిత్స పొందిన వారిలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి