Featured Post
వాతావరణమార్పులతో వ్యాధులు
వాతావరణ మార్పులు వ్యాధులకు కారణమౌతున్నాయా? ఈ ప్రశ్నకు ‘ది లాన్సెట్’ అవుననే జవాబు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అకడమిక్ జర్...
4, నవంబర్ 2024, సోమవారం
వాతావరణమార్పులతో వ్యాధులు
వాతావరణ మార్పులు వ్యాధులకు కారణమౌతున్నాయా? ఈ ప్రశ్నకు ‘ది లాన్సెట్’ అవుననే జవాబు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అకడమిక్ జర్నళ్ళలో ‘ది లాన్సెట్’ ఒకటన్న విషయం తెలిసిందే. ఆ పత్రిక ఇటీవల ప్రచురించిన ఒక నివేదికలో వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తీవ్రమౌతున్నాయని పేర్కొంది. ఇప్పటికే చాలా దేశాలపై వీటి ప్రభావం పడిందని తెలపడంతో పాటు, దేశాల వారీగా నెలకొన్న పరిస్థితులను వివరింిచంది. కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ (Countdown on Health and Climate Change)
అన్న శీర్షికతో ఫ్రచురితమైన ఈ నివేదికలో వాతావరణ మార్పుల కారణంగా ప్రబలుతున్న వ్యాధుల ప్రభావం భారత దేశంపై కూడా తీవ్రంగా ఉందని పేర్కొనడం గమనార్హం. నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన 15 సూచికల్లో 10 సూచికలు ఆరోగ్యముప్పును నిర్దారించాయని ఆ సంస్థ పేర్కొంది. ‘2023లో, వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యానికి హాని కలిగించే తీవ్ర ఉష్టోగ్రతలకు ప్రజలు గురయ్యారు. అనూహ్యంగా సాధారణం కన్నా 50 రోజులు ఎక్కువగా అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా ప్రపంచ భూభాగంలో 48 శాతంను కరువు పీడించింది.‘ అని నివేదిక వివరించింది. ఇది ఇప్పటి వరకు నమోదైన త్రీవ్ర కరువులో రెండవది’ అని పేర్కొంది.
1981 -2010 మధ్య గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం ఏటా 151 మిలియన్ల మంది ప్రజలు ఆహార అభద్రతకు గురయ్యారని తెలిపింది. ఈ సమస్య కొన్ని దేశాల్లో ఒక మాదిరి, మరికొన్ని దేశాల్లోత్రీవంగా వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. ఆహార కొరత అనారోగ్యానికి దారి తీసిందని వివరించింది.
గ్లోబల్ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా ఉన్నటు నివేదికలో పేర్కొన్నారు. ‘భారతదేశం ఇటీవల రికార్డు స్థాయిలో వేడిగాలులను చవిచూసింది. 2023లో, ప్రతి వ్యక్తి సంవత్సరానికి 100 రోజులకు సమానమైన 2,400 గంటలకు పైగా ఎండల్లో గడపాల్సి వచ్చింది. నడక వంటి తేలికపాటి బహిరంగ కార్యకలాపాలు కూడా కొన్ని సమయాల్లో సమస్యలుగా మారుతున్నాయి’ అని పేర్కొన్నారు. 2023తో ముగిసిన దశాబ్దంలో, శీతోష్ణస్థితి మార్పు కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు దేశ వ్యాప్తంగా వ్యాపిచాయని తెలిపింది. 1951-1960 దశాబ్ధం నుండి 2014-2023 వరకు ఏడెస్ ఆల్బోపిక్టాస్ దోమల ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందే సామర్థ్యం 85 శాతం పెరిగినట్టు నివేదికలో పేర్కన్నారు. తీరప్రాంతాలలో జనాభా కలరా వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నట్లు తెలిపారు.శిశువులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని నివేదిక పేర్కొంది. “2014-2023 నుండి, 65 ఏళ్లు పైబడిన ప్రతి శిశువులు, పెద్దలు సంవత్సరానికి సగటున 7.7 ,8.4 వడగాల్పలు రోజులకు గురయ్యారు. 1990-1999తో పోలిస్తే 47 శాతం మరియు 58 శాతం (పైగా). ఎక్కుివగా ఉందని లాన్సెట్ నివేదిక తెలిపింది. వేసవి తీవ్రత కారణంగా కార్మికులు పనిచేసే సత్తాను కోల్పోతున్నారని పేర్కొంది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల మన దేశంలో సుమారుగా కోటి మంది ముప్సును ఎదుర్కుంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. సుందర్‌బన్స్, ముంబై, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ ముప్పులో ఉన్నారని తెలిపింది. ‘వాతావరణ సంక్షోభం ఆరోగ్య సంక్షోభంగా మారుతోంది.గ్రహం వేడెక్కుతున్న కొద్దీ, వాతావరణ సంబంధిత విపత్తలు వ్యాపించే సంఖ్య, తీవ్రత పెరుగుతుంది, ఇది భూ గోళం మీద ఏ ఒక్క ఫ్రాంతానికో పరిమితం కాదు.’ అని నివేదికలో పేర్కొనగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కూడా దాదాపుగా ఇవే మాటలు అన్నారు. ‘ప్రజల ఆరోగ్యాన్ని; జీవితాలను కాపాడాలంటే జీవనోపాధి చర్యలను పెద్ద ఎత్తున పెంచాలి. ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాలి. పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచాలి.’ అని ఈ నివేదిక ప్రపంచ దేశాలకు సూచించింది. మన దేశంలో ఉపాధి హామీ వంటి పేదలకు పని చూపించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగం పెరగడంతో పాటు, నిత్యావసర వస్తువల ధరలు ఆకాశాన్ని దాటి దూసుకుపోతున్నయి. ఫలితంగా అత్యధికప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది. తాజా నివేదిక నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు ప్రజానుకూల చర్యలు తీసుకుంటాయి.
ు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి