Featured Post

రూపాయి మహాపతనం

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...

20, నవంబర్ 2024, బుధవారం

నేల...నీళ్లు

నవంబర్‌ 21... ప్రపంచమత్స్య దినోత్సవం! మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు! చేపలనే కాదు! సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు! కొన్ని సంవత్సరాల క్రితం వరకు సముద్ర జలాల నిండా కనపడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమవుతుంటే ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలియక సతమతమౌతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులు 1997లో మొట్టమొదటిసారిగా వరల్డ్‌ ఫిషరీస్‌ కన్సార్టియమ్‌ ఫోరమ్‌ పేరిట మన దేశ రాజధాని న్యూఢల్లీిలో ఒక సమావేశం జరిగింది. దాదాపు 18 దేశాలనుండి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో వరల్డ్‌ ఫిషరీస్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, కార్పొరేట్‌ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్‌ 21ను మత్స్య దినోత్సవంగా జరపాలని ఆ సమావేశం పిలుపునిచ్చింది. తొలిసమావేశం జరిగి 27 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్యకారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు. ఇప్పుడు జలచరాలకే కాదు... మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలుష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈ దుష్పరిణామానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూములపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని అన్ని జలవనరులను విషతుల్యంగా మారుస్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తున్నారు. జలచరాల గుడ్లను కూడా మిగల్చకుండా ఊడ్చేస్తున్నారు. అందుకే. మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపునింపిన నీళ్లకోసం పోరాడాల్సివస్తోంది! ఈ పరిణామాలు మన రాష్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా తూర్పుతీరంలోని లక్షలాదిమంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి. తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్పచెబుతున్నాయి. సముద్రజలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎందరు? రాష్ట్రానికి సుదీర్ఘమైన 974 కి.మీల సముద్రతీర ప్రాతం ఉంది. సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011లెక్కల ప్రకారం) సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం 12,747 మోటారైజ్డ్‌ ,1771 మెకనైజ్డ్‌,14,677 సాంద్రాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గాయి. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వ్యాపారవేత్తల నుండి వందల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కారణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యంగా మారింది. ఎక్కడైతే స్వేఛ్చగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీడ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను, చేప పిల్లలను వదిలివేస్తూ సాగే ‘బతుకు..బతికించు’ జీవన విధానంనుండి సర్వస్వాన్ని దోచేసే కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళకింద నేలను... బోటుకింద నీళ్లను ...’ లాగేసే ప్రభుత్వ విధానాలు తీర ప్రాంతంలో తిష్టవేయడంతో మత్స్యకారుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. ఏం జరుగుతోంది...? నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగుతోంది. సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండంటో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది. నదుల్లో చేరుతున్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రంలో కలుస్తున్న విషపదార్ధాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు. రిలయన్స్‌ వంటి సంస్థలు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ నిబంధనలను కాదని బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమిగోని స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈ వాస్తవం పూర్తిగా అర్ధమైంది. ‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు. తీసుకెళ్లి చూపిచేస్తారు కూడా.. కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు. పైగా రోజురోజుకి పెరుగుతుంటుంది.’అని కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో జెట్టి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక మత్స్యకార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగుతూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్‌ బోటులో మరో ముగ్గురు, నలుగురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన ‘కొన్ని సంవత్సరాల క్రితం ఒడ్డునే చేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సివస్తుంది. రోజుల తరబడి సముద్రం మీదనే ఉండాల్సివస్తోంది. ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు. ఒక్కోసారి బోటుమీద తీసుకేళ్లే వారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు. ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో కనిపించడం లేదు. వీటిలో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్పమని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి! కలవరపెడుతున్న కోత! కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. పిల్లి పిల్లలను మార్చినట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాంతాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సివస్తోంది. అయినా, తరతరాలుగా అలవాటైన సముద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. ందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన 80 సంవత్సరాల కాలంలో ఇక్కడ 2 కిలో మీటర్ల భూమి కోతకు గురైంది. 1989 నుండి ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా! ‘ ఒకే దగ్గర నివాసం ఉండటమన్నది మరచిపోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం. మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా. ఇక్కడ ఉంటున్నాం’ అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో ఇళ్లను కోల్పోని వారు ఒక్కడ ఒక్కరంటే ఒక్కరూ లేరు. ఇలా నష్టపోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్టలతో మిగలడం వారికి మాములే! ఉప్పాడలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89 కి.మీ భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7శాతం! దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. ఏ జిల్లాలో ఎంత కోత? జిల్లా కోత(కి.మీలలో) శ్రీకాకుళం 25.12 విశాఖపట్నం 25.81 తూర్పుగోదావరి’ 89.25 కృష్ణా 57.55 నెల్లూరు 53.52 తీరం కార్పొరేట్లకి ...! కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతఈ పరిణామం మరింత వేగవంతమైంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు, మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ కాస్తా అదాని ప్రదేశ్‌గా మారుతోంది. పోర్టులను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సముద్రంలోకి నౌకలకు ఆంటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37 కి.మీ పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్‌ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16కి.మీ మేర కాంపౌండ్‌వాల్‌ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరంపోర్టు వద్ద కూడా ఇదే స్థితి. గోడ నిర్మాణంతో కి.మీ దూరం వెళ్లి వేటకు వెళ్లాల్సిన పరిస్తితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు, సెజ్‌లు, సాగరమాల ప్రాజెక్టుల పేరుతో తీర ప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, పెట్రోకెమికల్స్‌ ఫార్మా పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివిస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌, రాంకీ ఫార్మ సిటి,హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌లు వీటిలో కొన్ని! వీటి నుండి విడుదలయ్యే కాలుష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీనిని నియంత్రిస్తున్నట్లు, కాలుష్య నివారణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ చెబుతున్న విషయాలు మాటలకే పరిమితం! దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది. సముద్రమూ వారికే... మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు, వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగాపెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్‌ అక్వాకల్చర్‌ అథారిటీ`సిఎఎ (అమెండ్‌మెంట్‌) బిల్లు `2023` సాధారణ మత్స్యకారులకు ప్రాణాంతకంగా మారనుంది. ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్ధాం. 2005`06లో 24,386గా ఉన్న సాధారణ బోట్ల (నాన్‌ మోటరైజ్డ్‌) సంఖ్య 2015`16 నాటికి 17,837కు తగ్గింది. గత ఏడాదికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచనా! వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్‌ బోట్లకు లక్షల రూపాయల్లో పెట్టుబడులు అవసరమైంది. లాభాలు భారీగా వస్తుండటంతో కార్పొరేట్‌ శక్తులు ఈ రంగం పై కన్నేశాయి. వలల సైజు మార్చి సముద్రాన్ని ఊడ్చేచేయడం మొదలు పెట్టాయి. డీప్‌ సీ ఫిషింగ్‌కు కేంద్రం అనుమతిఇవ్వడంతో భారీ వెజల్స్‌ రంగ ప్రవేశం చేశాయి. వీటన్నింటి ఫలితంగా చిన్న మత్స్యకారులు మాములు బోట్లలో వేటకు వెళ్లినా చేపలు దొరకని పరిస్థితి ఏర్పడిరద. దీంతో వీరు పెద్ద బోట్లపైన కూలీలుగా మారారు. ఇది చాలదన్నుటు తాజాగా తీసుకువచ్చిన సిఎఎ బిల్లులో కోస్టల్‌ రెగ్యులేటరీ నిబంధనలను ఎత్తివేశారు. బ్లూ ఎకానమి, సముద్ర ఆధారిత టూరిజం, డీప్‌ సీ మైనింగ్‌ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్యకారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని, సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది! నేల...నీళ్లు నవంబర్‌ 21... ప్రపంచమత్స్య దినోత్సవం! మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు! చేపలనే కాదు! సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు! కొన్ని సంవత్సరాల క్రితం వరకు సముద్ర జలాల నిండా కనపడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమవుతుంటే ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలియక సతమతమౌతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులు 1997లో మొట్టమొదటిసారిగా వరల్డ్‌ ఫిషరీస్‌ కన్సార్టియమ్‌ ఫోరమ్‌ పేరిట మన దేశ రాజధాని న్యూఢల్లీిలో ఒక సమావేశం జరిగింది. దాదాపు 18 దేశాలనుండి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో వరల్డ్‌ ఫిషరీస్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, కార్పొరేట్‌ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్‌ 21ను మత్స్య దినోత్సవంగా జరపాలని ఆ సమావేశం పిలుపునిచ్చింది. తొలిసమావేశం జరిగి 27 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్యకారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు. ఇప్పుడు జలచరాలకే కాదు... మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలుష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈ దుష్పరిణామానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూములపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని అన్ని జలవనరులను విషతుల్యంగా మారుస్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తున్నారు. జలచరాల గుడ్లను కూడా మిగల్చకుండా ఊడ్చేస్తున్నారు. అందుకే. మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపునింపిన నీళ్లకోసం పోరాడాల్సివస్తోంది! ఈ పరిణామాలు మన రాష్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా తూర్పుతీరంలోని లక్షలాదిమంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి. తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్పచెబుతున్నాయి. సముద్రజలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎందరు? రాష్ట్రానికి సుదీర్ఘమైన 974 కి.మీల సముద్రతీర ప్రాతం ఉంది. సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011లెక్కల ప్రకారం) సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం 12,747 మోటారైజ్డ్‌ ,1771 మెకనైజ్డ్‌,14,677 సాంద్రాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గాయి. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వ్యాపారవేత్తల నుండి వందల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కారణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యంగా మారింది. ఎక్కడైతే స్వేఛ్చగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీడ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను, చేప పిల్లలను వదిలివేస్తూ సాగే ‘బతుకు..బతికించు’ జీవన విధానంనుండి సర్వస్వాన్ని దోచేసే కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళకింద నేలను... బోటుకింద నీళ్లను ...’ లాగేసే ప్రభుత్వ విధానాలు తీర ప్రాంతంలో తిష్టవేయడంతో మత్స్యకారుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. ఏం జరుగుతోంది...? నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగుతోంది. సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండంటో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది. నదుల్లో చేరుతున్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రంలో కలుస్తున్న విషపదార్ధాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు. రిలయన్స్‌ వంటి సంస్థలు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ నిబంధనలను కాదని బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమిగోని స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈ వాస్తవం పూర్తిగా అర్ధమైంది. ‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు. తీసుకెళ్లి చూపిచేస్తారు కూడా.. కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు. పైగా రోజురోజుకి పెరుగుతుంటుంది.’అని కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో జెట్టి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక మత్స్యకార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగుతూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్‌ బోటులో మరో ముగ్గురు, నలుగురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన ‘కొన్ని సంవత్సరాల క్రితం ఒడ్డునే చేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సివస్తుంది. రోజుల తరబడి సముద్రం మీదనే ఉండాల్సివస్తోంది. ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు. ఒక్కోసారి బోటుమీద తీసుకేళ్లే వారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు. ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో కనిపించడం లేదు. వీటిలో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్పమని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి! కలవరపెడుతున్న కోత! కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. పిల్లి పిల్లలను మార్చినట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాంతాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సివస్తోంది. అయినా, తరతరాలుగా అలవాటైన సముద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. ందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన 80 సంవత్సరాల కాలంలో ఇక్కడ 2 కిలో మీటర్ల భూమి కోతకు గురైంది. 1989 నుండి ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా! ‘ ఒకే దగ్గర నివాసం ఉండటమన్నది మరచిపోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం. మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా. ఇక్కడ ఉంటున్నాం’ అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో ఇళ్లను కోల్పోని వారు ఒక్కడ ఒక్కరంటే ఒక్కరూ లేరు. ఇలా నష్టపోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్టలతో మిగలడం వారికి మాములే! ఉప్పాడలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89 కి.మీ భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7శాతం! దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. ఏ జిల్లాలో ఎంత కోత? జిల్లా కోత(కి.మీలలో) శ్రీకాకుళం 25.12 విశాఖపట్నం 25.81 తూర్పుగోదావరి’ 89.25 కృష్ణా 57.55 నెల్లూరు 53.52 తీరం కార్పొరేట్లకి ...! కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతఈ పరిణామం మరింత వేగవంతమైంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు, మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ కాస్తా అదాని ప్రదేశ్‌గా మారుతోంది. పోర్టులను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సముద్రంలోకి నౌకలకు ఆంటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37 కి.మీ పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్‌ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16కి.మీ మేర కాంపౌండ్‌వాల్‌ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరంపోర్టు వద్ద కూడా ఇదే స్థితి. గోడ నిర్మాణంతో కి.మీ దూరం వెళ్లి వేటకు వెళ్లాల్సిన పరిస్తితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు, సెజ్‌లు, సాగరమాల ప్రాజెక్టుల పేరుతో తీర ప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, పెట్రోకెమికల్స్‌ ఫార్మా పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివిస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌, రాంకీ ఫార్మ సిటి,హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌లు వీటిలో కొన్ని! వీటి నుండి విడుదలయ్యే కాలుష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీనిని నియంత్రిస్తున్నట్లు, కాలుష్య నివారణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ చెబుతున్న విషయాలు మాటలకే పరిమితం! దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది. సముద్రమూ వారికే... మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు, వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగాపెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్‌ అక్వాకల్చర్‌ అథారిటీ`సిఎఎ (అమెండ్‌మెంట్‌) బిల్లు `2023` సాధారణ మత్స్యకారులకు ప్రాణాంతకంగా మారనుంది. ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్ధాం. 2005`06లో 24,386గా ఉన్న సాధారణ బోట్ల (నాన్‌ మోటరైజ్డ్‌) సంఖ్య 2015`16 నాటికి 17,837కు తగ్గింది. గత ఏడాదికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచనా! వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్‌ బోట్లకు లక్షల రూపాయల్లో పెట్టుబడులు అవసరమైంది. లాభాలు భారీగా వస్తుండటంతో కార్పొరేట్‌ శక్తులు ఈ రంగం పై కన్నేశాయి. వలల సైజు మార్చి సముద్రాన్ని ఊడ్చేచేయడం మొదలు పెట్టాయి. డీప్‌ సీ ఫిషింగ్‌కు కేంద్రం అనుమతిఇవ్వడంతో భారీ వెజల్స్‌ రంగ ప్రవేశం చేశాయి. వీటన్నింటి ఫలితంగా చిన్న మత్స్యకారులు మాములు బోట్లలో వేటకు వెళ్లినా చేపలు దొరకని పరిస్థితి ఏర్పడిరద. దీంతో వీరు పెద్ద బోట్లపైన కూలీలుగా మారారు. ఇది చాలదన్నుటు తాజాగా తీసుకువచ్చిన సిఎఎ బిల్లులో కోస్టల్‌ రెగ్యులేటరీ నిబంధనలను ఎత్తివేశారు. బ్లూ ఎకానమి, సముద్ర ఆధారిత టూరిజం, డీప్‌ సీ మైనింగ్‌ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్యకారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని, సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది!

8, నవంబర్ 2024, శుక్రవారం

జిడిపి పతనం దేనికి సంకేతం...?

ఆర్థిక వ్యవస్థ పనితీరుకు కొలమానగా భావించే స్థూల దేశీయ ఉత్పత్తి (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్టు -జిడిపి) గణాంకాల్లో వృద్ధి తగ్గుదల నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) సెప్టెంబర్‌ నెలలో క్రితం విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్‌ -జూన్‌ మధ్య కాలంలో 6.7 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. గడిచిన పదిహేను నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో జిడిపి వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఇదే కాలంలో 8.2శాతంగా జిడిపి వృద్ధి ఉంది. రిజర్వు బ్యాంకు అంచనాల కన్నా కూడా ఈ ఏడాది సాధించిన వృద్ధి చాలా తక్కువ. గత సంవత్సరం ఏడాది పొడవునా సగటున 8 శాతం జిడిపి వృద్ధి నమోదు కావడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 7.2 శాతం జిడిపి వృద్ధిని తొలుత ఆర్‌బిఐ అంచనా వేసింది. ఆ తరువాత దానిని సవరించి 7.1 శాతం వృద్ధి ఖాయమని పేర్కొంది. దానికి భిన్నంగా వాస్తవ గణాంకాల్లో గణనీయమైన తగ్గుదల నమోదుకావడంతో భిన్న వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. -జివిఎ) గణాంకాలు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టాయి. జివిఎ 8.3 శాతం నుండి 6.8 శాతానికి తగ్గినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు, ఆయన వందిమాగాధులు ప్రతిరోజు ఘనంగా చెప్పుకుంటున్న సమయంలోనే వృద్ధి లెక్కల్లో వేగవంతమైన తిరోగమనం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ పతనానికి గల కారణాలను గుర్తించి సరిదిద్దడానికి బదులుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సాకులు వెతుకుతోంది. ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు వెల్లడిరచిన తరువాత స్పందించిన ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిడిపి పతనానికి కారణంగా చెప్పారు. ఎన్నికల కోడ్‌ కారణంగా వివిధ పథకాలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే వ్యయం గణనీయంగా తగ్గడమే దీనికి దారి తీసిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులు మరో కారణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ కూడా ఖర్చు తగ్గుముఖం పట్టడం వృద్ధి పతనానికి కారణమని అన్నారు. ఈ మాటల అర్ధం ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ వ్యయం కీలకమనే కదా! కానీ దీనిని అవకాశంగా తీసుకుని ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థల మానిటైజేషన్‌ను మరింత వేగంగా పూర్తి చేయాలన్న సూచనలు కార్పొరేట్‌ మేధావుల నుండివస్తున్నాయి. అయితే, జిడిపి తగ్గడానికి వాస్తవమైన కారణం ఏమిటి? కేంద్రంలోని ప్రభుత్వాలు (గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బిజెపి) అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలే ఈ పరిస్థితికి కారణమన్నది ఈ ప్రశ్నకు సమాధానం. ఆ విధానాల కారణంగానే దేశంలో ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న పేదరికాన్ని, అకలి కేకలను ఐక్యరాజ్యసమితి నుండి అనేక అంతర్జాతీయ నివేదికలు ఎత్తి చూపాయి. నిరుద్యోగం, ఉపాధి రహిత పరిస్థితులు పెరుగుతున్న తీరును అనేక నివేదికలు వివరించాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు చుక్కలను చూడటం ప్రజానీకానికి రోజూ అనుభవంలో ఉన్నదే! దీనిని నివారించడానికి ప్రభుత్వ ఖర్చును, ముఖ్యంగా పేదల కోసం చేసే ఖర్చును భారీగా పెంచాలని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎందరో నిపుణులు, ఆర్థిక వేత్తలు సూచించినా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధుల దిగ్గోతే దీనికి నిదర్శనం! వ్యవసాయ రంగంపైన ఇటువంటి నిర్లక్ష్యాన్నే మోడీ ప్రభుత్వం చూపించింది. కనీస మద్దతు ధర చట్టం కోసం ఏళ్ల తరబడి రైతాంగం చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకపోగా, యూరియాతో పాటు ఇతర ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ మొత్తంలో కోత పెడుతోంది. అదే సమయంలో వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరించేందుకు పథకాలు రూపొందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న అంతరాలు దేనికి నిదర్శనమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గణాంకాల్లో మాయాజాలం చేసి బూటకపు వృద్ధిని చూపించినా ఎక్కువ రోజులు ఆ టక్కుటమార విద్యలు వాస్తవాలు వెల్లడికాకుండా ఆదుకోలేవు.

4, నవంబర్ 2024, సోమవారం

వాతావరణమార్పులతో వ్యాధులు

వాతావరణ మార్పులు వ్యాధులకు కారణమౌతున్నాయా? ఈ ప్రశ్నకు ‘ది లాన్సెట్’ అవుననే జవాబు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అకడమిక్ జర్నళ్ళలో ‘ది లాన్సెట్’ ఒకటన్న విషయం తెలిసిందే. ఆ పత్రిక ఇటీవల ప్రచురించిన ఒక నివేదికలో వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తీవ్రమౌతున్నాయని పేర్కొంది. ఇప్పటికే చాలా దేశాలపై వీటి ప్రభావం పడిందని తెలపడంతో పాటు, దేశాల వారీగా నెలకొన్న పరిస్థితులను వివరింిచంది. కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ (Countdown on Health and Climate Change) అన్న శీర్షికతో ఫ్రచురితమైన ఈ నివేదికలో వాతావరణ మార్పుల కారణంగా ప్రబలుతున్న వ్యాధుల ప్రభావం భారత దేశంపై కూడా తీవ్రంగా ఉందని పేర్కొనడం గమనార్హం. నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన 15 సూచికల్లో 10 సూచికలు ఆరోగ్యముప్పును నిర్దారించాయని ఆ సంస్థ పేర్కొంది. ‘2023లో, వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యానికి హాని కలిగించే తీవ్ర ఉష్టోగ్రతలకు ప్రజలు గురయ్యారు. అనూహ్యంగా సాధారణం కన్నా 50 రోజులు ఎక్కువగా అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా ప్రపంచ భూభాగంలో 48 శాతంను కరువు పీడించింది.‘ అని నివేదిక వివరించింది. ఇది ఇప్పటి వరకు నమోదైన త్రీవ్ర కరువులో రెండవది’ అని పేర్కొంది. 1981 -2010 మధ్య గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం ఏటా 151 మిలియన్ల మంది ప్రజలు ఆహార అభద్రతకు గురయ్యారని తెలిపింది. ఈ సమస్య కొన్ని దేశాల్లో ఒక మాదిరి, మరికొన్ని దేశాల్లోత్రీవంగా వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. ఆహార కొరత అనారోగ్యానికి దారి తీసిందని వివరించింది. గ్లోబల్ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా ఉన్నటు నివేదికలో పేర్కొన్నారు. ‘భారతదేశం ఇటీవల రికార్డు స్థాయిలో వేడిగాలులను చవిచూసింది. 2023లో, ప్రతి వ్యక్తి సంవత్సరానికి 100 రోజులకు సమానమైన 2,400 గంటలకు పైగా ఎండల్లో గడపాల్సి వచ్చింది. నడక వంటి తేలికపాటి బహిరంగ కార్యకలాపాలు కూడా కొన్ని సమయాల్లో సమస్యలుగా మారుతున్నాయి’ అని పేర్కొన్నారు. 2023తో ముగిసిన దశాబ్దంలో, శీతోష్ణస్థితి మార్పు కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు దేశ వ్యాప్తంగా వ్యాపిచాయని తెలిపింది. 1951-1960 దశాబ్ధం నుండి 2014-2023 వరకు ఏడెస్ ఆల్బోపిక్టాస్ దోమల ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందే సామర్థ్యం 85 శాతం పెరిగినట్టు నివేదికలో పేర్కన్నారు. తీరప్రాంతాలలో జనాభా కలరా వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నట్లు తెలిపారు.శిశువులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని నివేదిక పేర్కొంది. “2014-2023 నుండి, 65 ఏళ్లు పైబడిన ప్రతి శిశువులు, పెద్దలు సంవత్సరానికి సగటున 7.7 ,8.4 వడగాల్పలు రోజులకు గురయ్యారు. 1990-1999తో పోలిస్తే 47 శాతం మరియు 58 శాతం (పైగా). ఎక్కుివగా ఉందని లాన్సెట్ నివేదిక తెలిపింది. వేసవి తీవ్రత కారణంగా కార్మికులు పనిచేసే సత్తాను కోల్పోతున్నారని పేర్కొంది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల మన దేశంలో సుమారుగా కోటి మంది ముప్సును ఎదుర్కుంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. సుందర్‌బన్స్, ముంబై, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ ముప్పులో ఉన్నారని తెలిపింది. ‘వాతావరణ సంక్షోభం ఆరోగ్య సంక్షోభంగా మారుతోంది.గ్రహం వేడెక్కుతున్న కొద్దీ, వాతావరణ సంబంధిత విపత్తలు వ్యాపించే సంఖ్య, తీవ్రత పెరుగుతుంది, ఇది భూ గోళం మీద ఏ ఒక్క ఫ్రాంతానికో పరిమితం కాదు.’ అని నివేదికలో పేర్కొనగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కూడా దాదాపుగా ఇవే మాటలు అన్నారు. ‘ప్రజల ఆరోగ్యాన్ని; జీవితాలను కాపాడాలంటే జీవనోపాధి చర్యలను పెద్ద ఎత్తున పెంచాలి. ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాలి. పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచాలి.’ అని ఈ నివేదిక ప్రపంచ దేశాలకు సూచించింది. మన దేశంలో ఉపాధి హామీ వంటి పేదలకు పని చూపించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగం పెరగడంతో పాటు, నిత్యావసర వస్తువల ధరలు ఆకాశాన్ని దాటి దూసుకుపోతున్నయి. ఫలితంగా అత్యధికప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది. తాజా నివేదిక నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు ప్రజానుకూల చర్యలు తీసుకుంటాయి.

1, నవంబర్ 2024, శుక్రవారం

రెండు ప్రపంచాలు

నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు భూగోళాన్ని రెండు ప్రపంచాలుగా విడగొట్టిన తీరును, ధనిక`పేదల మధ్య అంతరాలను పెంచిన వైనాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక అద్దం పట్టింది. ‘ ప్రపంచ వాణిజ్య నివేదిక`2024’పేరుతో విడుదలైన దీనిలో డబ్ల్యుటిఓ ఆవిర్భవించిన తరువాత గత 30 ఏళ్ల కాలంలో (1995`2023) సాధించిన అభివృద్ధిని వివరించారు.
దానికనుగుణంగానే నివేదిక నిండా గణాంకాలను ఏకరవు పెట్టారు. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల మీద నయానా`భయానా రుద్దిన సరళీకరణ ఆర్థిక విధానాలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, నిజాన్ని దాచిపెట్టలేకపోయారు. పెట్టుబడిదారీ విధానం అమలులో అనివార్యంగా మారే సంక్షోభాలు, అవి సృష్టించే సంక్లిష్ట పరిస్థితులను ప్రస్తావించక తప్పని స్థితి! దేశాల మధ్య అంతరాలనే కాదు, ఆ దేశాల్లోని ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతల్ని పేర్కొనక తప్పలేదు! ‘ద్రవ్యోల్బణాన్ని సవరించిన తరువాత ప్రపంచ తలసరి ఆదాయం ఈ 30 ఏళ్ల కాలంలో 65 శాతం పెరిగింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థల ఆదాయం రెండు నుండి మూడు రెట్లు పెరిగింది. ఇది వివిధ దేశాల్లో పేదరికాన్ని తగ్గించింది. విద్యను, ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది’ అని ప్రారంభంలో నివేదిక పేర్కొంది. ఇటువంటి మాటల గారడితో నింపివేసినప్పటికీ, ‘అనేక దేశాల్లో ఆదాయ పంపిణీ లో తీవ్ర అసమానతలు ఉన్నాయి.’ ప్రపంచ వ్యాప్తంగా 71.2 కోట్ల ప్రజానీకం ఇంకా తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారు’ ‘ కోవిడ్‌ సమయంలో కొందరి ఆదాయం అనూహ్యంగా పెరిగింది’ అన్న వ్యాఖ్యలు అసలు వాస్తవాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో తక్కువ, మద్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం గణనీయంగా పెరగిందని చెప్పిన డబ్ల్యుటిఓ 2009వ సంవత్సరం తరువాత జిడిపి తగ్గుదల ,నిరుద్యోగం, పేదరికం పెరగడం వంటి ప్రతికూల ఫలితాలకు మాత్రం తొలుత ఆర్థిక సంక్షోభాన్ని, ఆ తరువాత కరోనాను కారణంగా చూపింది. ‘స్వేఛ్చా వాణిజ్యం ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. పేదరికాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించింది. అయినా, అనేకమంది వ్యక్తులు, ప్రాంతాలు, వ్యవస్థలు ఈ విధానం నుండి ప్రయోజనం పొందలేకపోతున్నారు’ అని పేర్కొంది. అంతేకాదు, ప్రపంచ జనాభాలో 13 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలను లీస్ట్‌ డెవలప్డ్‌ కంట్రీస్‌ (ఎల్‌డిసి)లుగా పేర్కొనడంతో పాటు ఈ దేశాల్లో అంతరాలు తగ్గడానికి బదులుగా మరింతగా పెరుగుతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గుతోందని పేర్కొంది. కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు ఈ విషయాలనే చెబుతూ, ప్రజల కష్టాలకు, కడగళ్లకు కారణం వివరిస్తూ, పరిష్కార మార్గాన్ని చూపుతున్న వారిని తప్పుడు ప్రచారం చేస్తున్నవారిగా చిత్రీకరించడానికి డబ్ల్యుటిఓ ప్రయత్నించింది. ‘ఈ విధానాలు పేద దేశాలకు, పేద ప్రజలకు వ్యతిరేకం. ఇవి కొన్ని దేశాల, కొందరు వ్యక్తుల లాభాలను మాత్రమే పెంచుతాయి. కోవిడ్‌ సమయంలో అనుభవించిన కష్టాలకూ ఇవే కారణం’ అని ప్రపంచీకరణను వ్యతిరేకించే కొందరు ‘అదే పనిగా ప్రచారం చేస్తున్నారు’ అని నివేదికలో డబ్ల్యుటిఓ పేర్కొంది. పెరుగుతన్న అసమానతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అధిగమించడానికి ఇప్పటిదాకా వ్యతిరేకించిన సంక్షేమ పథకాలనే డబ్య్లుటిఓ ఏకరువు పెట్టింది. కార్మికులకు రాయితీలు ఇవ్వడం, ఉచిత విద్య, వైద్యం, తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందచేయడం, నిరుద్యోగులకు భృతి చెల్లించడం, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ చర్యల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పిన ప్రపంచ వాణిజ్య సంస్థ దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రపంచ దేశాలు మరింతగా మార్కెట్‌ గేట్లను తెరవాలని, వాణిజ్యంలో రక్షణాత్మక విధానాలను ఏమాత్రం అనుసరించకూడదని, ఎగుమతులు, దిగుమతుల అంశాలను మార్కెట్‌కు వదిలి వేయాలని సూచించింది. ఈ సూచనలు ఎవరికి మేలు చేస్తాయో. డబ్ల్యుటిఓ వంటి సంస్థలు ఎవరివైపు మాట్లాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!