Monday, November 16, 2009

పోరు

మానవాళి పయనములో పోరు లేని చోటేది
పోరే కదా నిలిపింది నిలువేతుగా మనిషిని
ఆది నుండి నేటి వరకు ఆవనిలోని మార్పులు
పోరువేసిన బాటలే ... మనిషి చేసిన మార్పులే

ఆనాట్టి కాలములో ఆ ఆదిమ జీవజలములో
మనుగడకై మనిసి పెట్టిన పొలికేక
మానవాళి గమనంలో ... ఆలుపెరగని పయనములో
పోరుకేక అయింది ... పోరాటం నేర్పింది

రాయినే ఆయుధముగా ... రాతియుగపు రోజుల్లో
కష్టాల కారడవిని అయిక్యముగా దాతామే
సమస్యలెన్ని వచ్చిన సమిధలేని రాలిన
ముందుకే సాగాము ... చరిత గతిని మార్చాము