Monday, November 16, 2009

పోరు

మానవాళి పయనములో పోరు లేని చోటేది
పోరే కదా నిలిపింది నిలువేతుగా మనిషిని
ఆది నుండి నేటి వరకు ఆవనిలోని మార్పులు
పోరువేసిన బాటలే ... మనిషి చేసిన మార్పులే

ఆనాట్టి కాలములో ఆ ఆదిమ జీవజలములో
మనుగడకై మనిసి పెట్టిన పొలికేక
మానవాళి గమనంలో ... ఆలుపెరగని పయనములో
పోరుకేక అయింది ... పోరాటం నేర్పింది

రాయినే ఆయుధముగా ... రాతియుగపు రోజుల్లో
కష్టాల కారడవిని అయిక్యముగా దాతామే
సమస్యలెన్ని వచ్చిన సమిధలేని రాలిన
ముందుకే సాగాము ... చరిత గతిని మార్చాము

Saturday, May 23, 2009

రెడ్ ఫ్లాగ్

పోరాటాల జెండా కు ఎన్ని గాయాలో
ఎన్నికల రణక్షేత్రం లో ఎన్ని కుట్రలో
పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన
విష పుత్రికలు చిందిన
హాలాహలం ...
బెంగాల్ నుండి ఆంధ్ర వరకు ...
రాజకీయ దళారుల తాత్కాలిక పై చేయి
అయితే ఏం ... అంతిమ విజయం మనదే...
విజయం సాధిస్తాం మనం ... అదే ఖాయం